calender_icon.png 1 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండలో ఆయుధ పూజ వైభవం

01-10-2025 01:56:11 AM

వాహనాలకు పూజలు చేసిన మున్సిపల్ కమిషనర్

మణికొండ;సెప్టెంబర్ ,30(విజయక్రాంతి )విజయదశమి పండుగను పురస్కరించుకుని మణికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి చెందిన వాహనాలకు ప్రత్యేక పూజలు జరిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  విధి నిర్వహణలో ఉపయోగించే వాహనాలు, పరికరాలను దైవంగా భావించి పూజించడం మన సంప్రదాయమని అన్నారు.

సిబ్బంది అంతా క్షేమంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ మాట్లాడుతూ, పండుగ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ పూజా కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, అహ్మద్ షా ఖాన్, నాయకులు యాలాల నరేష్, కిరణ్ కుమార్, రవికాంత్ రెడ్డి, డీఈలు శివ సాయి, సంజయ్, మేనేజర్ శ్రీధర్, ఇతర మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.