01-10-2025 01:57:24 AM
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ) విధి నిర్వహణలో అంకితభావం క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఉద్యోగి కి సమాజంలో ఆధార అభిమానాలు పొందుతారని, ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారి పదవి విరమణ సందర్బంగా సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించి డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని సన్మానించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో తప్పనిసరని, తన ఉద్యోగ జీవితంలో ఎలాంటి అవరోధం లేకుండా వీధి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత మీ జీవితంఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త అధ్యాయం మీకు ప్రశాంతతను, సంతోషాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. పదవి విరమణ కార్యక్రమానికి హాజరైన పలువురు మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డిఆర్‌ఓ సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.