calender_icon.png 28 January, 2026 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాశాఖ ప్రక్షాళన అవసరం!

17-01-2026 12:22:37 AM

కపిలవాయి దిలీప్‌కుమార్ :

ప్రపంచ జనాభాలో అతి పెద్ద దేశంగా, విస్తీర్ణంలో ఏడో అతి పెద్ద దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కీర్తించబడుతున్నది. దాదాపు 60 శాతానికి పైగా యువజనులు కలిగిన భారత్ మరోసారి ఒలంపిక్ క్రీడల్లో సాధించిన పతకాలు మన దేశ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయి. ప్రపంచపటంలో సరిగ్గా కనిపించని దేశాలు స్వర్ణాలు సాధిస్తూ పట్టికలో ముందు వరుసలో ఉంటే ఒక్క బంగారు పతకం కోసం 140 కోట్ల భారతావని కళ్లు రాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి రావడమేమిటన్నది ఆలోచించాల్సిన అం శం. 2024 ఒలంపిక్స్‌లో 200కు పైగా దేశా లు పాల్గొనగా మన దేశం నుంచి 100 మంది క్రీడాకారులు 16 రకాల క్రీడల్లో పా ల్గొంటే.. ఒక్క రజత పతకం సహా 5 కాంస్య పతకాలతో సరిపెట్టుకొని పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. 

ఆర్ధికంగా మనతో సరితూగలేని చిన్న దేశాలు సైతం పతకాల ప ట్టికలో మనకంటే ముందంజలో ఉండటాని కి మన దేశ పాలకులే ప్రధాన కారణం. విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూ గించే ఒలంపిక్ క్రీడా పోటీలు జరిగిన ప్రతిసారీ ప్రపంచంలో మన స్థానం గూర్చి ఆత్మ విమర్శ చేసుకోవడం, ఆ తర్వాత దానిని మ రిచిపోవడం భారతీయులకు అలవాటుగా మారిపోయింది. 128 సంవత్సరాల ఒలంపిక్ చరిత్రలో భారతదేశం ఇప్పటి వరకు కేవ లం 10 స్వర్ణాలు గెలువగా అందులో 8 స్వ ర్ణాలు హాకీలోనే రావడం గమనార్హం. మన దేశానికి ఉన్న వ్యవస్థ లెక్కల ప్రకారం ఒక ఒలంపియన్ కోసం ఏటా 8 లక్షల దాకా ఖ ర్చు అవుతున్నది.

ఒలంపిక్స్‌లో స్వర్ణానికి ఆ స్ట్రేలియా రూ.11 లక్షలు, అమెరికా రూ.25 లక్షలు, జపాన్ 34 లక్షలు, రష్యా 45 లక్షలుగా సజారానా ఇస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున పతకాలు గెలుస్తున్నారు. అమెరికా, ఇంగ్లాం డ్, రష్యా, చైనా, జపాన్ సహా అగ్ర దేశాల్లో క్రీడాకారులకు 8 ఏండ్ల వయస్సు నుంచే ఒ లంపిక్స్‌లో పతకాలు సాధించేలా ప్రోత్సహి స్తూ వారి ఖర్చంతా ఆయా ప్రభుత్వాలే చూ సుకుంటాయి. ఇక రష్యా, చైనా లాంటి క మ్యూనిస్టు దేశాల్లో స్పోర్ట్స్ స్కూల్లే ఒలంపి క్స్ కార్ఖానాలుగా ఉన్నాయి. అభివృద్ధి చెంది న దేశాలన్నింటిలో టోర్నీల నిర్వహణ పారదర్శకంగా సాగుతుంది. ఒలంపిక్ ప్రమాణా లను అందుకోగల క్రీడాకారుల గూర్చి ఒక అవగాహన వచ్చిన వెంటనే వారిని ఒలంపిక్ ప్రాబబుల్స్‌లో చేర్చి పతకం కోసం మరింత మెరుగైన శిక్షణ అందిస్తారు.

ప్రోత్సాహకాలు కరువు..

కానీ మన దేశంలో పాలకులు పతకాలు రావడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అం దించకుండా కష్టపడి పతకాలు సాధించిన ఒకరిద్దరు క్రీడాకారులకు భారీ నజరానాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. క్రీడాభివృద్ది సంస్థలను ఆయా క్రీడా సంఘాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి అర్హత లేకున్నా ఆశ్రీతులతో వాటిని నింపేస్తున్నారు. ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారితో నింపేస్తున్నారు. ఇలాంటి క్రీడా సంఘాల పెద్దలు, బంధు ప్రీతి, పక్షపాతం తో దేశంలో క్రీడలను పాతాళంలోకి తొక్కేయడానికి శాయాశక్తుల కృషి చేస్తున్నారు.

తమకు నచ్చిన క్రీడాకారులను ఎంపిక చేయ డం, తమ అవసరాలకు తగ్గట్టుగా టోర్నీల ను నిర్వహించడం, ఎన్నికలు లేకుండానే ఏళ్ల తరబడి ఏకగ్రీవంగా పదవుల్లో కొనసాగడం వంటివి భారత్‌లో యదేచ్ఛగా జరుగుతున్నాయి. క్రీడా సంఘాల్లో రాజకీయ నాయ కుల జోక్యాన్ని తగ్గించడం కోసం సంఘాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడానికి 2011లో జాతీయ క్రీడాస్మతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఒక్క వ్యక్తే క్రీడా సం ఘంలో ఏళ్ల తరబడి ఏక చత్రాధిపత్యాన్ని చ లాయించడానికి అవకాశం లేదు. ఒకేసారి రెండు సంఘాల్లో పదవులు నిర్వహించడం కుదరదు.

కానీ కొంత మంది నేతలు నియమాలను తుంగలో తొక్కి ఎప్పటిలాగే ఆధిప త్యం చెలాయిస్తున్నారు. భారత రెజ్లింగ్ మా జీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తన ఇంట్లోనే సంఘం కార్యాలయాన్ని పెట్టుకుని ఏళ్ల తరబడి కార్యకలాపాలు కొనసాగించడమే ఇం దుకు నిదర్శనం. ఇతనిపై లైంగిక ఆరోపణ లు చేస్తూ ఇతని రాజీనామా కోరుతూ మల్లయోధులు బజరంగ్ పూనియా, వీరేందర్ సింగ్‌లు పద్మశ్రీలను, వినేష్ ఫొగట్ అర్జున అవార్డులను వెనక్కి ఇస్తామని బెదిరిస్తే గాని ప్రభుత్వం దిగి రాలేదు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో..

ఉత్తమ క్రీడాకారులను అత్యుత్తమ శిక్షణ అందించుటకు ఖేలో ఇండియాలో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకుగానూ కేవలం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి అందులో 600 కోట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేయడాన్ని ఎలాంటి క్రీడా సమూనా అంటా రనేది ప్రధాని మోదీకే తెలియాలి. దేశంలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న భారత క్రీడా ప్రాధికారత సంస్థ (సాయ్) శిక్షకులు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. ప్రతి రాష్ర్టంలో సాయ్ కేంద్రాలు స్థానిక ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నడిపే ఆకాడమీలు, స్పో ర్ట్స్ పాఠశాలలున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం పాటియా ల, బెంగుళూరు కేంద్రాలపై దృష్టి సారిస్తోంది.

అక్కడ క్రీడాకారులకే వసతులు నిధు లు అందజేస్తుంది. ఇంత పెద్ద దేశంలో కేవలం రెండు కేంద్రాల నుంచే ఎంత మంది ఒలంపియన్లు తయారు చేసుకోగలమనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. కోచ్‌ల్లో జవాబుదారితనాన్ని పెంచి, రాష్ట్రాల్లోని సాయ్ కేంద్రాలను అకాడమీల్ని బలోపేతం చేసి మె రుగైన మౌళిక వసతులు, నాణ్యమైన శిక్షణ ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. కేవలం బడ్జెట్ కేటాయింపులే క్రీడల అభివృద్ధికి ప్రాతిపదిక కాకూడదు. దేశంలో సమగ్ర క్రీ డా విధానాన్ని రూపొందించాలి.

కేంద్రీకృత క్రీడా విధానానికి స్వస్తి పలికి వికేంద్రీకరణ అన్ని స్థాయిల్లో జరగాల్సిన అవసరముంది. దేశంలో కేవలం ప్రభుత్వం రంగంతోనే క్రీడాభివృద్ధి అసాధ్యం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఇప్పటికే ఎన్నో రంగాల్లో విజయం సాధించినందున క్రీడల్లో కూడా ఈ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయ డం అవసరం. అంతే కాకుండా క్రీడా వ్యవస్థలో అవినీతిని బంధుప్రీతిని, రాజకీయ జోక్యాన్ని నిరోధించేందుకు బీసీసీఐ ప్రక్షాళనకై నియమించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను దేశంలోని అన్ని క్రీడలకు వర్తింపజేసి సమూల ప్రక్షాళన దిశగా అడుగులేయాలి.

ఖర్చెక్కువ.. పతకాలు తక్కువ

భారత్‌లో క్రీడల పేరుతో ఒక్కో వ్యక్తిపై భారత్ చేస్తున్న ఖర్చు రూ.24 మాత్రమే ఉం డగా అది బ్రిటన్‌లో రూ. 760, ఆస్ట్రేలియాలో రూ. 930గా ఉన్నది. గత నాలుగు ఒలంపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా ఆరు పతకాలు అందించిన రెజ్లింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామన్న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురాలేక పోయింది. రేవంత్ సీఎం అయ్యాక క్రీడాశాఖకు బడ్జెట్‌లో 450 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ స్పోర్ట్స్ పాలసీలో కొత్తదనం ఏమి లేదు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టార్గెట్ ఒలంపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) వల్ల ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు నెలవారి ఉపకార వేతనంతో పా టు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ తీసుకోగలుగుతున్నారు. అలాంటి పథకం రాష్ర్టంలోనూ అమలు చేయాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రధానంగా ఒలంపిక్స్ సన్నద్ధతలో భాగంగా టాప్- ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి ఉపకార వేతనంతో పాటు మెరుగైన శిక్షణకు అయ్యే ఖర్చును రాష్ర్ట ప్రభుత్వం భరించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్)లో రెగ్యులర్ కోచ్‌లు కరువయ్యారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 130 కోచ్‌ల తోనే శాట్ నెట్టుకొస్తోంది. దీంతో నిపుణులైన కోచ్‌లు లేక రాష్ర్టంలో క్రీడాకారులకు సరైన శిక్షణ అందడం లేదు.

 వ్యాసకర్త సెల్: 9963027577