calender_icon.png 29 August, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పొంగుతున్న గోదావరి

29-08-2025 05:30:19 AM

భద్రాద్రి వద్ద 38 అడుగుల వద్ద వరద

భద్రాచలం(విజయక్రాంతి): గోదావరి ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా సంభవించిన తుఫానుతో భారీ వర్షాలు కురుస్తూ అనేక వాగులు వంకలు గోదావరి ఉపనదులు ప్రవహించడం వల్ల గోదావరి నది భద్రాచలం వద్ద రెండవ సారి నీటిమట్టం పెరుగుతున్నది. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు 38.6 అడుగులకు నీటిమట్టం చేరింది.

శుక్రవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వరకు చేరుకుంటుందని అధికారులు భావించి అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నకు ఎగువున గల పేరూరు వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు 13. 5 మీటర్ల ఎత్తున గోదావరి నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఆ నీరు భద్రాచలం చేరుకోవడానికి 6 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆ వరద నీరు చేరుకోవడంతో మరోసారి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల మెట్లు గోదావరి ముంపుకు గురికావడంతో యాత్రికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గోదావరి ఉపనది అయిన తాళి పేరు ప్రాజెక్ట్ కు చత్తీస్‌గఢ్ నుంచి భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో 24 గేట్లు ఎత్తి 57 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గురువారం సాయంత్రం భద్రాచలం నుంచి దిగువ ప్రాంతానికి 7,45,596 లక్షల నీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్నది.