24-11-2025 12:35:45 AM
-గ్లోబల్ సమ్మిట్ వేడుకల్లో లోపాలు ఉండొద్దు
-సమన్వయంతో అధికారులు పనిచేయాలి
-ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి/కందుకూరు, నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ బ్రాండ్‌ను ప్రతిబిం బించేలా గ్లోబల్ సమ్మిట్ వేడుకలకు ఏర్పా ట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేడు కల ఏర్పాట్లను సీఎం ఆదివారం పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండ లం బేగరి కంచె ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. గ్లోబల్ సమ్మిట్ వేడు కల ఏర్పాట్లపై ఫ్యూచర్ సిటీ ప్రత్యేక కమిషనర్ శశాంక్, కలెక్టర్ నారాయణరెడ్డితోపాటు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా ప్రపంచమంతా తెలంగాణ వైపు తొంగి చూ సేలా వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
దేశవిదేశాల నుంచి దా దాపు 2 వేల మందికిపైగా వ్యాపారవేత్తలు వచ్చే ఈ సమ్మిట్‌కు ఎక్కడా ఇబ్బందులు, లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రత్యేక కమిషనర్ శశాంక్‌కు గ్లోబల్ స మ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని, వేడుకలకు సంబంధంలేని వారి ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ఆదేశించారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో కలియతిరిగారు.
ఈ సమ్మిట్‌కు ప్రపంచస్థాయి ప్రతినిధులు హాజరవుతారని, సమ్మిట్‌కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వేడుకలో ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు ఆడియో, వీడియో రూపంలో డాక్యుమెంటరీ ఉండాలని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే ప్రతి ఒక్కరూ పాసులు కలిగి ఉండాలని, పాసులు లేకుండా ఎవరినీ అనుమతిం చొద్దన్నారు.
ఈ సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో శాయశక్తుల కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్న పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం వెంట ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి కేఎల్‌ఆర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
-నూతన సీజేఐ ప్రమాణస్వీకారానికి హాజరు
-పార్టీ, ప్రభుత్వ పెద్దలతోనూ భేటీకి అవకాశం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.