calender_icon.png 29 January, 2026 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పోటీలో ఉంటుంది

29-01-2026 12:18:41 AM

మల్లెల వీరనారాయణ

పాల్వంచ, జనవరి 28, (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరిలో ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ స్పష్టం చేశారు. బుధవారం పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న  ఆదేశాల మేరకు నిర్ణయం ప్రకటించినట్లు తెలి పారు. 

పార్టీ  ముఖ్య ఉద్దేశ్యం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధికారం కోసం, వారి హక్కుల కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. అధికారం, ఆత్మగౌరవం మా వాటా ఎవరికెంతో వారికి అంత, ఇది తమ నినాదం. ఇదే  పార్టీ ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.