19-07-2025 01:04:21 AM
మహబూబాబాద్, జూలై 18 (విజయ క్రాంతి): బావి వద్ద ఏర్పాటుచేసిన విద్యుత్ మోటార్లు తరచుగా అపహరణకు గురవు తుండడంతో చెట్టు పైన ఏర్పాటుచేసిన సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో నుంచి అపహరించిన గొలుసు దొంగలను కొద్దిసేప ట్లోనే పట్టించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన బొగ్గు వెంకటమ్మ అనే వృద్ధురాలు పొలంలో కలుపు తీసి రోడ్డుపైకి రాగా అప్పుడే అక్కడికి స్కూటీపై వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడా యించారు.
దీనితో బాధితురాలు ఒక్క సారిగా కేకలు వేయడంతో అక్కడికి చేరిన కొందరు వెంటనే ఈ విషయాన్ని వెంకట మ్మ బంధువులకు తెలుపగా ఆమె మను మడు నందు అక్కడికి చేరుకొని వెంటనే చెట్టు పైన ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ముఖానికి దస్తికట్టుకొని ఉన్న దృశ్యాలు కనిపించాయి. వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే స్పందించిన ఎస్ ఐ మురళీధర్ రాజ్ పోలీసులను అప్రమత్తం చేసి పలు రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. సదరు చోరీకి పాల్పడ్డ ఇద్దరు అగంతకులు నెల్లికుదురు మండలం ఆలేరు వైపు వెళ్తుండగా అక్కడ పట్టుకొని ప్రశ్నించడంతో తామే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించడంతో వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని క్రైమ్ బ్రాంచ్ వారికి అప్పగించి విచారణ జరుపుతున్నారు. విద్యుత్ మోటార్ల దొంగల కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా తన నాయనమ్మ మెడలో గొలుసును కాపాడుకోగలిగినట్లు మనవడు పేర్కొన్నాడు.