12-08-2025 12:54:16 AM
- రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనపర్చే కుట్ర
- ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): దేశంలో రాజ్యాంగానికి ప్రమా దం పొంచి ఉందని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ ఆరోపించారు. మనుధర్మం కోసం బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనప రుస్తున్నాయని ఆయన విమర్శించారు. సోమవారం బెల్లయ్య నాయక్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లా డుతూ దేశ చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుడిని, ఇండియా కూటమి నేతలను అరెస్టు చేశారని, ఇది బ్లాక్ డేగా పరిగణించాలన్నారు.
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతులు దాడి చేసే పరిస్థితి దాపు రించిందని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఈసీని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్‌లో దొంగలు చేరారని, బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగేందుకు అర్హత లేదన్నారు.