calender_icon.png 8 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నకొడుకే కాలయముడయ్యాడు

08-09-2025 01:47:03 AM

  1. కన్న కూతురిపై క్షుద్ర పూజలు చేసిండని అనుమానంతో హత్య

కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పి వెంకట్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 7: తన తల్లి పేరున ఉన్న భూమి విషయంలో నిత్యం గొడవలు జరుగుతుండడం, కూతురును చేతబడి చేసి చంపారని తండ్రిపై పెంచుకున్న అనుమానం హత్యకు దా రితీసిందని పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన నిందితులను ఆదివారం పోలీసులు రిమాండ్ తరలించారు. కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశంలొ వివరాలు వెల్లడించారు.

పట్టణంలోని వాసవి నగర్ చెందిన బాలయ్య(75) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 3న రోజువారీ గానే సాయంత్రం పొలం వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో మరునాడు తన చిన్న కుమారుడు మల్లేష్ పొలం వద్దకు వెళ్లగా తండ్రి ఉపయోగించే ద్విచక్ర వాహనం అక్కడే ఉన్నప్పటికీ తండ్రి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు అక్కడికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా బాలయ్య కుమారుడైన బీరయ్య తండ్రిని కర్రతో కొట్టి హత్య చేసి తన మేనల్లుడైన వంగూరు మండలం రంగాపూర్ కు చెందిన ఓరే అంజికి ఫోన్ చేసి కారు తీసుకుని పొలం వద్దకు రమ్మన్నాడు ఇద్దరు కలిసి మృతదేహాన్ని కారు డిక్కిలో వేశారు. ఎక్కడికన్నా తీసుకెళ్లి పడవేయాలని సూచించడంతో అతను కారు తీసుకొని డిండి చింతపల్లికి వెళ్ళాడు. రాత్రి అయ్యాక నిందితుడు బీరయ్య ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకొని మృతదేహాన్ని తలను మొండెంను యాక్సిస్ బ్లేడుతో కోసి వేరు చేశాడు.

మృతుని చెవులకు ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని మొండెంను బ్రిడ్జిపై నుండి వాగులో పడేయగా తలను సమీపంలోని డిఎల్‌ఐ కాల్వలో వేసి పరారీ అయ్యారు. బాలయ్య వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్న రామచంద్రి అనే వ్యక్తి దాడి చేసిన సంఘటనను చూసినట్లు తెలిపారు. ఇద్దరే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుతెలిపారు.