08-09-2025 01:48:23 AM
రాజాపూర్ సెప్టెంబర్ 7: మండల కేంద్రంలో దుందుభి నది పరివాహ ప్రాంతం లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా జోరుగా సాగుతుంది. వాగు పరిసర ప్రాంతాల్లో యంత్రాలతో మట్టినితోవి కృత్రిమంగా ఇసుకను తయారుచేసి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
పక్కనే కస్తూరిబా గురుకుల పాఠశాల ముందర నుంచి ఇసుక ట్రాక్టర్లు టిప్పర్రు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం ధ్వంసం కావడంతో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.