08-09-2025 01:45:09 AM
గులాబీ జెండా ఎగిరేయడమే నా పని
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట సెప్టెంబర్ 7: అచ్చంపేటలో తనకు ఎలాంటి ఆశ లేదని పోటీ చేసే ఉద్దేశమే లేదని కేవలం గ్రామ గ్రామాన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసేలా అందరిని సమన్వయ పరచడమే తన ముందున్న లక్ష్యమని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
ఆదివారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు హాజరై ప్రసంగించారు. నియోజకవర్గంలో ఎవరికి భయపడాల్సిన పనిలేదని ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలనిసూచించారు.