calender_icon.png 27 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉన్నావ్’ బాధిత కుటుంబం నిరసన

27-12-2025 01:29:46 AM

ఢిల్లీ హైకోర్టు ఎదుట ఉద్రిక్తత

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౬: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వెలుపల చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కేసులో ఇప్పటికే కిందికోర్టు దోషిగా తేల్చిన కుల్దీప్‌సింగ్ సెంగార్‌పై విధించిన శిక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆందోళనకు దిగారు. దోషికి కోర్టు బెయిల్ రద్దు చేయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు.

కోర్టుకు వెలుపల నిరసనలు తెలపడం చట్టవిరుద్ధమని, కావాలంటే ‘జంతర్ మంతర్’ వద్దకు వెళ్లి నిరసన తెలపాలని భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని హెచ్చరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.