calender_icon.png 27 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమలులోకి పెరిగిన రైల్ టికెట్ చార్జీలు

27-12-2025 01:31:29 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కేంద్ర రైల్వే శాఖ పెంచిన రైల్ టికెట్ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 215 కిలోమీటర్ల ప్రయాణం వరకు  జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణానికి సాధారణ తరగతిలో ప్రతి కిలో మీటరుకు 1పైసా చొప్పున, మెయిల్,ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలో మీటరుకు 2పైసల చొప్పున రైలు టికెట్ చార్జీలు పెరిగాయి. 

216 కిలో మీటర్ల నుంచి 750 కిలో మీటర్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులు అదనంగా రూ.5, . ఇక, 751 కి.మీ నుంచి 1,250 కి.మీ వరకు ప్రయాణించే వారు రూ. 10, అదే 1,251 కి.మీ నుంచి 1,750 కి.మీ మధ్య ప్రయాణాలకు రూ.15 అదనంగా, 1,751 కి.మీ నుంచి 2,250 కి.మీ వరకు దూ రాలకు రూ.20 అదనపు భారం పడుతోంది.