calender_icon.png 17 August, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ పరాక్రమం! సౌందర్య శృంగార వైభవం!!

03-01-2025 12:00:00 AM

కుత్తువిళక్కెరియ= గుత్తు దీపాలు, ఎఱియ= వెలుగుతూ ఉండగా, కొట్టుక్కాల్= దంతంతో చేసిన కోళ్లు గలిగిన, కట్టిన్ మేల్= మంచంపైన, మెత్తెన్ఱ= మెత్తనైన, ప్చశయనత్తిన్ మేల్= ఐదు గుణాలుగల పా న్పుపైన, ఏఱి= ఎక్కి, కొత్తు= గుత్తులుగా ఉన్న, అలర్= వికసించిన, పూజ్ఞుక్కళల్= పూలుము డిచిన కొప్పుగల, నప్పిన్నై= నీళాదేవి, కొజై  ్ఞమేల్= స్తనములపై, వైత్తుక్కడన్ద= శరీరాన్ని ఆనించి పడుకున్న, మలర్= వికసించిన మార్ పా= వక్షస్థలం గలిగిన వాడా,

వాయ్ తిఱవాయ్= నోరు తెఱచి ఓ మాట చెప్పు, మై= కాటుక పెట్టుకుని, తడమ్= విశాలమైన, కణ్ణినాయ్= కన్నులు గలదానా, నీ= నీవు, ఉన్మణాళనై= నీ వల్లభుని, ఎత్తనైపోదుమ్= కొంత సేపటికైనా, తుయిలెళవొట్టాయ్ కాణ్= లేవనీయవా ఏమి, ఎత్తనైయేలుమ్= ఎంత మాత్రమైనా, పిరివు= తెఱపి ఎడబాటు, అత్తగి ల్లాయ్=ఓర్వలేవా, ఆల్= ఆశ్చర్యం, తత్తువ మన్ఱు= నీ స్వరూపం కాదుకదా, తకవన్ఱు= నీ స్వభావమూ కాదుకదా?

“దీపపు శెమ్మెలమధ్య ఏనుగుదంతాల కోళ్లతో చేసిన మంచం మీద మెత్తని పత్తి పాన్పుపైన, వికసిస్తున్న పుష్పాలను కొప్పులో తురిమిన నీళాదేవి ఎదపై ఒరిగి నిద్రిస్తున్న క్రిష్ణయ్యా మమ్ము చూడు, విప్పారిన కాటుక కన్నుల నీళమ్మా, ఆయన్ను నిద్ర లేవనీయవా, ఒక్క క్షణమైనా ఆయన్ను వదలడం సహించ లేవా, ఇది నీ స్వరూపానికి తగదమ్మా, ఇది నీ స్వభావమూ కాదమ్మా...” అని గోపికలు గోదమ్మ నాయకత్వంలో నీళా భవనానికి వచ్చి లోనున్న నీళాకృష్ణులతో సంభాషించి సంభావించే మధుర గీతం ఇది.

శ్రీకృష్ణ పరాక్రమాన్ని, సౌందర్య శంగార వైభవాన్ని గోదాదేవి అద్భుతంగా ఆవిష్కరిస్తా రీ పాశురంలో. కంసుడు తనపైకి పంపిన కు వలయా పీడమనే ఏనుగును మట్టుబెట్టి ఆ దంతాలతో తన శయనాగారంలో మంచం త యారు చేయించారు. ఏనుగు దంతాలు ఆయ న వీరత్వానికి ప్రతీక. ఆ దంతపు కోళ్ల మంచం పైన మెత్తని, తెల్లని, విశాలమైన, వెచ్చని సుగం ధాలు విరజిమ్మే పరుపు.

తన భర్త శ్రీకృష్ణుడు అలసిపోయి నిద్రిస్తున్నాడు. వీరపత్ని అయిన నీళాదేవి కూడా ఆ తల్పంపైన శ్రీకృష్ణుని ఎదపై శయనించి ఉంది. ఆ మంచం మీంచి లేవడాని కీ, ఆయన్ను లేపడానికీ సంకోచిస్తున్నది. ఎవ రో వచ్చారని తెలిసిన నీళాదేవి “వచ్చిన వారి తో నేనే మాట్లాడతాను.

ఆయనను లేపడం ఎందుకు!” అని ఆలోచిస్తున్నది. “ఏమమ్మా ఒక్క క్షణమైనా ఆయన్ను వదలవా, క్రిష్ణయ్య నిద్ర లేవడానికి సమ్మతించవా” అంటూ “ఇది నీ లక్షణం కాదు కదమ్మా” అంటున్నారు బయట వేచి ఉన్న గోదా గోపికలు. అయినా, భర్త నిద్రకు ఆటంకం జరగకూడదని నీళాదేవి అనుకుంటూ ఉంటే, “నీవు నచ్చ జెప్పి మా ద గ్గరకు పంపాల్సింది పోయి, కనీసం లేపనైనా లేపవా తల్లీ” అని వేడుకుంటున్నారు గోపిక లు. “ఇంత పొద్దున్నే ఏమిటీ అల్లరి అని ఊళ్లో పెద్దలు అంటారేమోనని మేము ఇంకా చీకటి విడిపోకముందే చిన్న దీపపుకాంతిలో వెతు క్కుంటూ వచ్చాం.

నీవేమో లోపల అనేకానేక దీపాలు వెలిగించి రాత్రిని పగలుగా మార్చి శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఆరాధిస్తూ కూర్చున్నా వు. మా ఇంట్లోకూడా దీపాలు వెలిగిస్తే కదా నీ అనుభవం పరిపూర్ణమయ్యే ది? రాముడు సీత ప్రేమతో వెలిగిపోయాడు ఆయనకు వేరే దీపాలకాంతి ఎందుకు! నీవు శ్రీకృష్ణుని వైభవాన్ని వెలిగించే దీపపు శెమ్మెవు. ఇంకా వే రే దీపాలెందుకు.

మాకు దూరంగా ఉన్నం దుకు నీకు బాధగా ఉండాలి కదా, మెత్తని ప రుపు కఠినంగా అనిపించాలి కదా! అదేమీ లేదా, హాయిగా నూలు పరుపుమీద పడుకు న్నావా? కృష్ణుడికి దూరంగా ఉన్న మా బాధను అర్థం చేసుకోలేవా?” అని బతి మాలుతు న్నారు గోపికలు. ఈ పాశురంలో గోదాదేవి బృందావనంలోని శ్రీకృష్ణుని అభిమానుల బృందానికి నాయక త్వం వహిస్తున్నది. పది పాశురాలద్వారా గోపి కలను నిద్ర లేపి తనవెంట తీసుకువచ్చి నీళాకృష్ణులున్న వైభవ భవనానికి గోదాదేవి చేరుకున్నది.