02-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, జనవరి౧: సుదూర ప్రయాణాలు చేసేవారు ఎంతగానో ఎదురుచూ స్తున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొందరలోనే పట్టాలపై పరుగులు పెడుతాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్లీపర్ రైలుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్ల డిం చారు.
గువహటి -- కోల్‌కతాల మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుందని అన్నారు. బుధవారం 180 కిలోమీటర్ల స్పీడుతో వందే భారత్ స్లీపర్ రైలు పరీక్ష విజయవంతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభిస్తారన్నారు. ట్రైన్ టికెట్ ధరల విషయానికి వస్తే.. నాన్ ఏసీ టికెట్ ధర 2,300 రూపాయలు ఉంటుంది.