calender_icon.png 2 January, 2026 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ సంపన్నంగా, సంతోషంగా ఉండాలి

02-01-2026 12:00:00 AM

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు  

ఢిల్లీ, జనవరి1: నూతన సంవత్సర రాకను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంపన్నంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భాన్ని నూతన శక్తి, సానుకూల మార్పునకు చిహ్న ంగా రాష్ట్రపతి ముర్ము అభివర్ణించారు. ఇది బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో కొత్త శక్తిని నింపుతుందని ఆమె తన ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ శాంతి, ఆనందం, శ్రేయస్సును రాష్ట్రపతి ఆకాంక్షించారు.

దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ 2026 మ నందరి జీవితాల్లో శాంతి, సంతోషం తీసుకురావాలన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ తన సందేశంలో దేశ ప్రజలకు నూత న సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఏడాది అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షించారు.  

అద్భుతమైన సంవత్సరం కావాలి: మోదీ

ప్రధాని మోదీ తన సందేశంలో ఈ ఏడా ది అందరికీ అద్భుతమైన సంవత్సం కావాలని కోరుకుంటున్నానన్నారు. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాల ని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా.. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడా ది సమాజంలో ఆనందం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఉండాలన్నారు. రాబోయే సంవత్సరం మీ ప్రయత్నాలలో విజయంతో.. మీరు చేసే ప్రతి పనిలో నెరవేర్పుతో మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలి‘ అని ఆయన ఎక్స్‌లో రాశారు.