calender_icon.png 18 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హింసాత్మకంగా జెన్-జెడ్ ఉద్యమం

18-11-2025 12:13:34 AM

-మెక్సికో నగరంలో ఉద్రిక్తత 

మెక్సికో సిటీ, నవంబర్ 17: మెక్సికో దే శంలో నానాటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆ దేశ జెన్‌జెడ్ యువత గళమెత్తింది. దేశవ్యాప్తంగా ఉద్యమాలకు నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగం గా తాజా దేశ రాజధాని నగరం మెక్సికోలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. దేశాధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువతీ యువకులు నగరాన్ని స్తం భింపజేశారు.

ఈ క్రమంలో అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు.  భవన సముదాయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం సైతం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఘర్షణాలో 120మంది గాయపడగా, వీరిలో 100మంది పోలీసులే ఉన్నారు.