calender_icon.png 18 September, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ సంపదను భావితరాలకు అందించాలి

09-02-2025 06:25:27 PM

రేంజ్ అధికారి ఇక్బాల్ హుస్సేన్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భావితరాలకు అటవీ సంపదపై అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేంజ్ అధికారి ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వనదర్శిని కార్యక్రమంలో భాగంగా కాగజ్ నగర్ లోని ఊర్దూ పాఠశాల విద్యార్థులు సిర్పూర్ రేంజ్ పరిధిలోని చింతకుంట ఫారెస్ట్ లో ఆదివారం పర్యటించారు. ఇందులో భాగంగా సోలార్ కుంట, చెక్ డ్యాం, భూపాలపట్నం వ్యూ పాయింట్ తదితర ప్రదేశాలను సందర్శించారు. అటవీ మార్గంలో పర్యటిస్తూ పలు చెట్లు, పక్షులు, జంతువుల అడుగులను ఆసక్తిగా గమనించారు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్ అటవీ సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ కొరకు అటవీ సిబ్బంది చేస్తున్న పనులు, తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేస్తూ అటవీ సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేశారు. భవిష్యత్తు తరాల మనుగడకు అటవీ సంరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ ప్రసాదరావు, బీట్ అధికారులు మల్లికార్జున్, రవీనా, వాచర్లు ఇర్ఫాన్, భీంరావ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.