calender_icon.png 27 September, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమమే తన లక్ష్యం

27-09-2025 01:10:18 AM

మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): ప్రజల సంక్షేమ మే తన లక్ష్యమని, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో తృప్తి నిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంథనిలో దైవ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అన్నా రు. శుక్రవారం మంత్రి శ్రీధర్‌బాబు మంథని పట్టణంలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.

మంత్రి శ్రీధర్‌బాబు మొదటగా మంథనిలోని మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని భజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మారుపాక ప్రశాంత్, ఆలయ సేవకులు అవధానుల శ్రీనివాస్, మారుపాక నటరాజ్ లు మంత్రిని  సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీలలితా దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి హోమగుండంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ సేవాసదనం అధ్యక్షులు కర్నే హరిబాబు, నిర్వాహకులు నల్లగొండ హరి, దుద్దిళ్ల గణపతి, కొల్లారపు శ్రీనివాస్, ఆలయ అర్చకులు పల్లి మురళీధర్ మంత్రిని సన్మానించారు.

అనంతరం శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయంలో  బాబావారిని మంత్రి శ్రీధర్‌బాబు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షురాలు మహావాది జలజ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మనకంటి మురళీధర్ మంత్రిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి  శ్రీధర్‌బాబు వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, రెడ్డి సంఘo అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రి రమాదేవి సురేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు శశి భూషణ్ కాచే, బండ కిషోర్ రెడ్డి, పెంటరి రాజు, చొప్పకట్ల హనుమంతరావు, ఎక్కేటి అనంతరెడ్డి, ఆకుల కిరణ్, ఆరేల్లి కిరణ్, రావికంటి సతీష్ కుమార్, ఎల్లంకి సదానందం తదితరులు ఉన్నారు.