calender_icon.png 27 September, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ సంబంధాల వారధి "యాత్రా దానం"

27-09-2025 01:10:54 AM

మంచిర్యాల,(విజయక్రాంతి): ‘మానవ సంబంధాల వారధి - మానవత్వపు బహుమతి’ నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘యాత్ర దానం’ కార్యక్రమం ద్వారా సేవలు అందించనుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, అసిస్టెంట్ ఇంజనీర్ సధాకర్ లతో కలిసి యాత్ర దానం కార్యక్రమ గోడ ప్రతులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక దివ్యాంగులు, ఆశ్రయం పొందుతున్న వారిని ఆహ్లాదకర ప్రాంతాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన యాత్ర దానం కార్యక్రమం ద్వారా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు తమ సేవలు అందించవచ్చన్నారు. జీవితంలో ప్రత్యేకమైన, ఆనందకరమైన రోజులను ఇతరులకు శాశ్వతంగా గుర్తుండే విధంగా పండుగలు, దైవదర్శనాలు, విహారయాత్రలు, వైజ్ఞానిక యాత్రలకు యాత్ర దానాన్ని చేసి ఆనందాన్ని పంచవచ్చన్నారు.