30-07-2025 05:56:12 PM
కలెక్టరేట్ లో స్టాల్స్ ఏర్పాటు..
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన తినుబండారాలు, వస్తువులను బుధవారం అమ్మకానికి స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు తయారుచేసిన పచ్చళ్ళు, మిల్లెట్ బిస్కెట్స్, మల్టీ గ్రైన్ స్వీట్ అండ్ హార్ట్, తేనె, పిండి వంటకాలు, క్యారీ బ్యాగులు డెమో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కు వచ్చిన ప్రజలు స్టాల్స్ ను ఆసక్తిగా సందర్శించారు. 500 గ్రాముల తేనె 300 రూపాయలు, మామిడి, నిమ్మ, చింతకాయ, ఉసరి, టమాట పచ్చళ్ళు 400 రూపాయలకు కేజీ కాగా చికెన్ పచ్చడి 1200 రూపాయలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మిల్లెట్ బిస్కెట్ ₹100, మల్టీ గ్రీన్ (స్వీట్) కేజీ 200 రూపాయలు,మల్టీ గ్రీన్ హాట్ కేజీ 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు పిండి వంటకాలు చేపడుతున్నారు. ఈ స్టాల్స్ ఐదు రోజులపాటు కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఆర్డిఏ అధికారులు తెలిపారు.