05-12-2025 12:15:34 AM
రామ కిష్టయ్య సంగనభట్ల :
నేడు ప్రపంచ మట్టి దినోత్సవం :
భూమిపై మౌనంగా పడి ఉన్న మట్టితల్లి తన మనుగడ కోసం చెందుతున్న ఆవేదన వర్ణనాతీతం. మానవ జీవన వ్యవస్థలో అతిప్రధానమైన ఆధారం నేల. చిన్ననాటి నుంచి మనం మట్టితోనే మొదలై, మట్టిలోనే ముగుస్తామని చెప్పడం ఏ తత్వవేత్త భావం కాదు.. అది శాశ్వత ప్రకృతి నియమం. మనిషి ఆహారం, దుస్తులు, గృహాలు, ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలు ఇలాంటివన్నీ ఈ నిశ్శబ్ద సహజ సంపదపై ఆధారపడి ఉన్నాయి.
కానీ ఈ నేల ఇప్పుడు మానవ కల్పిత అ వాంచిత ప్రమాదాల కారణంగా తన శక్తిని, సారాన్ని, జీవాన్ని కోల్పోతూ నిస్సహాయ స్థితికి పడిపోతున్నది. నేల లేకపోతే పంటలు లేవు.. పంటలు లేకపోతే జీవనం లేదన్న అంతిమ సత్యాన్ని ప్రపంచం ఇప్పు డే గ్రహించడం ప్రారంభించింది. ప్రపంచ నేల దినోత్సవం అనే ఆలోచన 2002లో అంతర్జాతీయ మట్టి శాస్త్ర సంఘం ప్రతిపాదించినప్పటికీ, 2013లో ఐక్యరాజ్య సమి తి దీనికి అధికారిక గుర్తింపును ఇచ్చింది.
మట్టిని సంరక్షించడంలో విశేష కృషి చేసి న థాయ్‌లాండ్ మహారాజు రామ IX గౌరవార్థం ఈ దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 5న జరుపుకోవాలని నిర్ణయించింది. అప్ప టి నుంచి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌ను ప్రకటిస్తూ ప్రపంచంలోని ప్రభుత్వాలు, సైన్స్ సంస్థలు, పర్యావరణ సంస్థ లన్నీ మట్టిపై ఉన్న ప్రమాదాలపై చర్చలు, పరిశోధనలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.
33 శాతం క్షీణత..
ప్రపంచ ఆహారంలో 95 శాతం నేల నుంచే ఉత్పత్తి అవుతుండడం చూసుకుం టే సమస్త మానవజాతి నేలపై సంపూర్ణ స్థాయిలో ఆధారపడి ఉండడాన్ని స్పష్టం గా తెలియజేస్తున్నది. శాస్త్రవేత్తల ప్రకారం ఒక సెం.మీ. మందమైన, సారవంతమైన మట్టిపొరను ఏర్పరచడానికి ప్రకృతికి వందేళ్ల వరకు సమయం పడుతుంది. కానీ మనిషి కేవలం కొన్ని దశాబ్దాల్లోనే ఆ మట్టిని నాశనం చేస్తున్నాడు.
ఎఫ్‌ఏవో (FAO) నివేదిక ప్రకారం ప్రపంచంలోని 33 శాతం సారవంతమైన నేల ఇప్పటికే తీవ్ర క్షీణతకు గురైంది. ప్రతి సంవత్సరం 24 బిలియన్ టన్నుల మట్టి ఎరోషన్ కారణంగా ప్రవాహాల్లో పోతుంది. ఇదే వేగం కొనసాగితే మాత్రం 2050 నాటికి ప్ర పంచ పంట భూముల్లో సగభాగం వ్యవసాయానికి అనర్హమవుతుందని శాస్త్రవేత్త లు అంచనా వేస్తున్నారు. మట్టిలో నివసిం
చే సూక్ష్మజీవులు, పురుగులు, ఫంగస్‌లు, పురుగుమందుల ద్వారా నశించే బ్యాక్టీరియా.. ఇవి అన్నింటిని కలిపితే భూమి మీద జీవ వైవిధ్యంలో 25 శాతం మట్టిలోనే ఉంటుంది. వీటిలాగే మట్టిలో నిల్వ ఉండే కార్బన్ కూడా వాతావరణ మార్పులను తగ్గించే ప్రధాన శక్తి. ఒక హెక్టార్ ఆరోగ్యకరమైన మట్టి సంవత్సరానికి సు మారు 3 టన్నుల కార్బన్‌ను గ్రహించగలదని శాస్త్రవేత్తలు నిరూపించారు. అంటే మట్టి నష్టం కేవలం పంటల సమస్య మా త్రమే కాదు.. అది నేరుగా వాతావరణ మార్పులను వేగవంతం చేసే కారణంగా మారుతున్నది.
తీవ్రమైన హెచ్చరిక..
ప్రపంచవ్యాప్త పరిశోధనల ప్రకారం 2 బిలియన్ హెక్టార్ల భూభాగం ఇప్పటికే క్షీణతకు గురైపోయింది. భూమి సార నష్టంతో 2030 నాటికి ప్రపంచ ఆహారోత్పత్తి 25 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉంది. నీటి మట్టాల తగ్గుదల, అడవుల నరికివేత, భారీ యంత్రాల వినియోగం, వరుసగా ఒకే పంటలు పండించడం.. ఇవన్నీ మట్టిని పగిలిపోయిన పూడికగా మార్చుతున్నాయి. భారతదేశానికి మట్టి అంటే జీవనరేఖ. దేశంలో ఉన్న 328 మిలియన్ హెక్టార్లలో సుమారు 96 మిలియన్ హెక్టార్లు మట్టి క్షీణతకు గురైపోయాయని జాతీయ రిమో ట్ సెన్సింగ్ కేంద్రం ప్రకటించింది.
ప్రతి సంవత్సరం 5.3 బిలియన్ టన్నుల మట్టి నదుల్లోకి, చెరువుల్లోకి చేరి వ్యవసాయ ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తోంది. రసాయన ఎరువుల వినియోగం అమితంగా పెరగడంతో మట్టిలోని సేంద్రియ పదార్థం అనేక ప్రాంతాల్లో 0.3 నుంచి 0.5 శాతానికి పడిపోయింది. నీటిమట్టం తగ్గడంతో భూమిసారం పునరుద్ధరణ ప్రక్రియ ఆగిపోవడం కూడా పెద్ద సమస్యగా తయా రైంది. తెలంగాణ రాష్ర్టంలో పరిస్థితి మ రింత ఆందోళనకరంగా ఉంది.
వరి పంట పద్ధతి, అధిక రసాయన ఎరువులు, భూ గర్భ జలాల అధిక వినియోగం, చెరువుల ఉపశమనం లాంటివన్నీ కలిసి మట్టిని బలహీనపరుస్తున్నాయి. రాష్ర్టంలో దాదా పు 14 లక్షల హెక్టార్ల భూమిలో మట్టి క్షీణతకు గురైన భూభాగంగా గుర్తించడం ఆందోళనకరం.
మట్టిసేంద్రియ పదార్థం అనేక ప్రాంతాల్లో 0.5 శాతానికి కూడా చేరకపోవడం రైతుకు, పంటకు, పర్యావరణానికి క లిపి తీవ్రమైన హెచ్చరిక అని చెప్పొచ్చు. నీ టి నిల్వలో కీలకమైన చెరువులు, కుం ట లు, వాగులు చాలా చోట్ల మట్టి నింపడం తో తమ సహజ స్వభావాన్ని కోల్పోతున్నా యి. ఇదంతా మట్టిద్రవ్యతను పెంచి పంటలకు హాని కలిగిస్తున్న దుస్థితి ఏర్పడింది.
పవిత్ర కర్తవ్యంగా..
ఇలాంటి నేపథ్యంలో నేలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ఇది రైతు సహా దేశ పౌరులు కర్తవ్యంగా మారిపోయింది. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా మట్టిసారం పునరుద్ధరిం చవచ్చు. పంటల మార్పిడి, పచ్చిక సాగు, వర్మీ కంపోస్టు, గ్రీన్ మెన్యూరింగ్.. ఇవి మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచే మార్గాలు.
వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసే చెక్ డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెరువుల పునరుద్ధరణ వంటి పాత పద్ధతులు మట్టిని మరలా జీవంతో నింపగల వు. పర్యావరణ పరిరక్షణలో మట్టికి ఉన్న ప్రాధాన్యం విద్యార్థుల నుంచి విధాన నిర్ణేతల వరకు అందరికీ చేరేలా అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉం ది. భూమిపై ప్రతి మనిషికి నేలతో ఉన్న అనుబంధం జీవనకాలానికి మించినది.
బిడ్డ పుట్టే గదిలో నుంచి చివరి యాత్ర జరిగే శ్మశానం వరకూ మనిషి స్పర్శించే మొదటి, చివరి మూలకం మట్టి. అలాంటి మట్టికి మనం కాపరులుగా మారడం మనిషిగా మన బాధ్యత. ‘నేలను కాపాడితే.. జీ వితాన్ని కాపాడినట్లే’ అన్న నినాదం కేవ లం ఒక వాక్యం కాదు. అందరి కర్తవ్యం. అది భూమి భవిష్యత్తు. మనం మట్టిని రక్షిస్తే, మట్టి మన భవిష్యత్తును రక్షిస్తుందనేది జీవిత సత్యం. అందుకే నేలను పరిరక్షించడం ఒక ఎంపిక కాకూడదు. అది మన తరం నుంచి తదుపరి తరాలకు అప్పగించాల్సిన పవిత్ర కర్తవ్యంగా భావించాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9440595495