calender_icon.png 2 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టు ఉంది.. అర్హులు లేరు..

02-12-2025 01:02:08 AM

  1. రాజన్న ఆలయంలో డిప్యూటీ ఈవో పోస్టు మంజూరు 

అర్హులు లేక పోవడంతో పెండింగ్ లో కీలక పోస్టు

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 01 (విజయ క్రాంతి ): జిల్లారాష్ట్రంలోని రెండు ప్రధాన దేవాలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాల పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఒక్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు ప్రభుత్వం మంజూరు చేయగా యాదగిరిగుట్ట దేవాలయంలో నిబంధనల ప్రకా రం ఏఈఓ కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చారు. వేములవాడ దేవాలయంలో ఈ పోస్ట్ కు అర్హత కలిగిన వాళ్ళెవరూ లేకపోవడం వల్ల వేములవాడ ఆలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది.

ఈ క్రమంలో దేవాదాయ శాఖలో సాధారణ బదిలీలు జరగి, కొంతమంది సిబ్బంది ఇతర దేవాలయాలకు బదిలీ కావడం జరిగింది. వేములవాడ దేవాలయంలో కొంత కాలంగా అన్ని కాడర్లలో నిలిచిపోయిన పదోన్నతులు భర్తీ చేసే క్రమంలో ఆలయ ఈఓ అటెండర్ స్థాయి నుండి డిఇఓవరకు అర్హులైన వారందరి జాబితాను పరిశీలిస్తూ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చారు.

వేములవాడ దేవస్థానానికి చెందిన నలుగురు ఏఈఓ లలో డిఇఓ పోస్టు కావలసిన అర్హతలను పరిశీలించగా విజిలెన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సదరు నలుగురు ఏఈఓ లలో ముగ్గురికి ఇంక్రిమెంట్ కోత శిక్షకు గురై ఒక సంవత్సర కాలం వరకు పదోన్నతి పొందుటకు అర్హత కోల్పోయారు. ఏఈఓ నవీన్ కు మార్ మాత్రం ఎటువంటి ఆరోపణలు లేకపోవడం తో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పేపర్ ప్రమోషన్ ఇచ్చినారు.

ప్రస్తుతం బదిలీ పై యాదగిరిగుట్టలో పని చేస్తున్న కారణంగా అక్కడ డీఈవో పోస్టు ఖాళీ లేనందున వేములవాడ దేవాలయమునకు బదిలీ చేయాలని దేవాదాయ శాఖ కమీషరు కు ప్రతిపాదనలు పంపించారు. కానీ మూ డు నెలల తరువాత దేవాదాయ శాఖ ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించి సదరు ఉద్యో గికి డీఈవోగా వేతనం వేములవాడ దేవాలయం నుండి ఇచ్చుకుంటూ యాదగిరిగుట్ట టెంపుల్ లో ఏఈఓ స్థాయి పోస్టులో పని చేయమంటూ నిబంధనలకు విరుద్ధంగా ఉ త్తర్వులు జారీ చేసింది.

అలాగే మరో ఏఈఓ రాజన్ బాబును సైతం వేములవాడ నుండి యాదగిరిగుట్ట కు బదిలీ చేసి ఇక్కడినుండే వేతనం చెల్లిస్తున్నారు. ప్రస్తుతం వేములవాడ దేవాలయంలో బదిలీ పై వచ్చిన సిబ్బంది తరచూ సెలవుపై వెళ్ళడం, అనుభ వం ఉన్న సిబ్బంది బదిలీ పై వెళ్లడం తో సరైన సిబ్బంది లేకపోవడంతో పరిపాలనలో అస్తవ్యస్తమైంది. ఇప్పటికైనా వేముల వాడ ఆలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆలయ ఉద్యోగులు కోరుతున్నారు.