calender_icon.png 19 November, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో కళాకారులకు కొదువలేదు

19-11-2025 12:05:06 AM

  1. యువజన ఉత్సవాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నవంబర్ ౧8 (విజయక్రాంతి): యువజన ఉత్సవాలలో జిల్లాలు ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జాతీయ యువజన ఉత్సవాల సం దర్భంగా జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా స్థాయిలో యువజన కళాకారులు తమలోని కళా నైపుణ్యాన్ని, ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియ పరచడం కొరకు ఇలాంటి వేదిక లు ఎంతో ఉపయోగపడతాయని, జిల్లా స్థాయిలో ఎంపికైన కళాకారులు రాష్ట్ర స్థాయి లో, ఆ తర్వాత జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

జిల్లాలో కళాకారులకు కొదువలేదని, జిల్లా యంత్రాంగం కళాకారులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, యువజన సంఘాల ప్రతినిధులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.