calender_icon.png 19 November, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న ఆదివాసీల ధర్మ యుద్ధం మహా సభ

19-11-2025 12:03:50 AM

బెజ్జూర్, నవంబర్ ౧8 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆదివాసి మండల అధ్యక్షుడు కోరిత తిరుపతి మాట్లాడుతూ.. ఆదివాసి బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదం తో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఏకైక డిమాండ్ తో ఈనెల 23న ఉట్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను 9 తెగల ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ అధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఉట్నూర్ మహా సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిడం సాకారం, వ్యవస్థాపక అధ్యక్షులు కుర్సింగా ఓం ప్రకాష్, సర్మెడి కొడప శంకర్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆత్రం బక్కయ, కోయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెస్రం రాజారాం, ఆదివాసీ మహిళ అధ్యక్షరాలు ఎనుకా అమృత, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మెడి సతీష్, ప్రచార కార్యదర్శి సడ్మేక రమేష్, మాజీ సర్పచులు కొమురం హన్మంతు, కర్పేత రమేష్, కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల శ్యామ్ రావు, కొలవార్ మండల ఉపాధ్యక్షులు మనేపెళ్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.