15-08-2025 12:24:50 AM
కేఎల్‌ఐ డీ-82 కాల్వను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి, కలెక్టర్ సంతోష్
చారకొండ, ఆగస్టు 14: వర్షాకాలంలో సాగునీటి కాలువలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జూపల్లి గ్రామ శివారులో తెగిపోయిన కేఎల్‌ఐ డీ-82 కాల్వను కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
తెగిపోయిన కాల్వను తక్షణమే మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పార్థసారథి, ఈఈ శ్రీకాంత్, డీఈ లు సమ్మయ్య, దేవన్న, బుచ్చిబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకయ్య యాదవ్, నాయకులు బాలరాజు, పర్వత్ రెడ్డి పాల్గొన్నారు.