15-08-2025 12:24:47 AM
గుమ్మడిదల, ఆగస్టు 14 : గుమ్మడిదలలో బీజేపీ మండల అధ్యక్షులు కావలి ఐలేష్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని గుమ్మడిదల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సామల అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ త్రివర్ణ పతాకం పట్ల గౌరవం, ప్రేమను ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు సారా సృజనలక్ష్మి, విశ్రాంత వైమానిక దళ ఉద్యోగి శ్రీరాముల రత్నయ్య, మాజీ సైనిక ఉద్యోగులు భగవాన్, మండల ప్రధాన కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షులు సంజీవ, మండల పద అధికారుల కోఆర్డినేటర్ వీరారెడ్డి, ముత్యాల గౌడ్, సత్యనారాయణ, గంగాగౌడ్, మహిళా కార్యకర్తలు అనిత, సబిత నాయక్,రీనా, చిన్నారులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.