calender_icon.png 28 July, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఇంట్లో ఐటీ రైడ్స్ జరగలేదు

25-07-2025 02:26:15 AM

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి 

మేడ్చల్, జూలై 24 (విజయక్రాంతి): తమ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారంలో వాస్త వం లేదని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి తెలిపారు. 2022లో కాలోజీ యూనివర్సిటీ పీజీ సీట్లకు సంబంధించి ఈడీ వరంగల్ పో లీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ కేసు విచారణకు గురువారం ఉదయం ము గ్గురు వరంగల్ పోలీసులు తమ ఇంటి కి వచ్చారని తెలిపారు.

కొన్ని వివరాలు అడిగి నోటీసు ఇచ్చారని, తాము పిలిచినప్పుడు వరంగల్ రావాలని చెప్పారని ఆమె పేర్కొన్నారు. భద్రారెడ్డిగానీ, తా నుగానీ రావాలని చెప్పగా.. ఎప్పుడైనా వస్తామని చెప్పానని ఆమె తెలిపారు. పోలీసులు కేవలం విచారణకు మాత్ర మే వచ్చారని, ఇది ఐటీ, ఈడీ సోదాలు కావని తెలిపారు. ఐటీ, ఈడీ సోదాలు అయితే తాను మీడియాతో మాట్లాడే అవకాశం ఉండేది కాదన్నారు.