25-07-2025 02:24:57 AM
ఘట్‌కేసర్, జూలై 24 : పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనురాగ్ యూనివర్సిటీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్2 మరియు 3 ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్ వైటల్) సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈశిబిరం స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం, సమూహంగా ప్రాణాలు కాపాడే ప్రయత్నాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్టు తెలిపారు.ఈకార్యక్రమాన్ని అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి విజయ్ కుమార్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ బక్షి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ ప్రారంభించారు.
ఈసందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి లయన్ ఎస్. మాధవి, అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ ఎస్. నీలిమ హాజరై నిర్వాహకులు, విద్యార్థుల సేవాభావాన్ని అభినందించారు.ఈశిబిరంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్ సీ సీ క్యాడెట్లు చురుకుగా పాల్గొని 170 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరం సమాజ సేవకు మరియు యువతలో చైతన్యం పెంపొందించడంలో మద్దతుగా నిలిచింది.
లయన్స్ క్లబ్ వంటి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సేవా సంస్థలతో అనురాగ్ యూనివర్సిటీ కలసి నిర్వహించిన ఈ కార్యక్ర మం సమాజ సంక్షేమం పట్ల విశ్వవిద్యాలయం యొక్క నిబద్ధతను మరోసారి నిరూపించింది మరియు అందరి నుండి ప్రశంసలు అందుకుంది.