calender_icon.png 28 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీ

28-07-2025 12:05:03 AM

నిర్మల్, జూలై 2౭ (విజయక్రాంతి): జిపి ఓ (గ్రామ పాలన అధికారులు), లైసెనస్డ్ సర్వేయర్ల నియామక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో కలిసి పట్టణం లోని చాణక్య హై స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరీక్ష గదుల్లో జరుగుతున్న పర్యవేక్షణ, అభ్యర్థుల హాజరు, నిబంధనలు పాటింపు, ప్రశ్న పత్రాల పంపిణీ వంటి అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీ క్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించా రు. జిపిఓ పరీక్షకు మొత్తం 55 మంది అభ్యర్థులు హాజరుకావలసి ఉండగా, 37 మంది మాత్రమే హాజరయ్యారని 18 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

అలాగే లైసెనస్డ్ సర్వే యర్ పరీక్షకు 110 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 84 మంది హాజరైనట్టు కలెక్టర్ తెలిపారు.ఈ తనిఖీల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, నోడల్ అధికారి ఆర్. సుదర్శన్, పర్యవేక్షకులు మోతీరాం, సూర్యారావు, రాజేశ్వర్ గౌడ్, తహసిల్దార్ రాజు, పోలీసు సిబ్బం ది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

26 మంది అభ్యర్థుల గైర్హాజరు..

ఆదిలాబాద్, జూలై 2౭ (విజయక్రాంతి): లైసెనస్డ్ ల్యాండ్ సర్వేయర్‌ల అర్హత పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాల ఆరట్స్ అండ్ కామర్స్‌లో ఏర్పాటు చేసిన  పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పరీక్షా కేం ద్రాలోని గదులను, అభ్యర్థుల హాజరు శాతా న్ని పరిశీలించారు. మొత్తం 155 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కు హాజరుకానున్న నేపథ్యంలో కాగా అందులో ఉదయం, మధ్యా హ్నం పరీక్షకు హాజరైన అభ్యర్థులు 129 మంది హాజరుకాగా 26 మంది గైర్హాజరయ్యారు.కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి రాజాలింగు, సర్వే లాండ్ అధికారి ఉన్నారు.