calender_icon.png 28 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు

28-07-2025 12:06:44 AM

- భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు

- మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

మంచిర్యాల, జూలై 27 (విజయక్రాంతి) : అవినీతికి పాల్పడుతున్న మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావుకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, సహకరించే వారిని వదిలేది లేదని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించా రు.

ఆది వారం తన నివాసంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవడానికి కారణం చేయని పనులకు బిల్లులు చేయలేక, చేసిన పనికంటే ఎక్కు వ బిల్లు చెల్లించలేక తన ఉద్యోగం పోతుందనే భయంతోనేనని ఈ ప్రాంత ప్రజలు కోడై కూస్తున్నారన్నారు. కొంత మంది అధికారులు రాబోయే ఆపదను ముందే గ్రహించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, మరికొంత మంది ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారని, భవిష్యత్తులో వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపో వడం ఖాయమని, మంచిర్యాల నియోజక వర్గంలోనూ ప్రేమ్‌సాగర్‌రావు ఓటమి ఖా యం అయిపోయిందని, మితి మీరిన అవినీతి, దాడులు, ప్రతి వెంచర్ లో డబ్బులు వసూలు, తప్పుడు కేసులు, భూముల విషయంలో తలదూర్చడం వంటివి ఆయన ఓటమికి కారణా లవుతాయన్నారు. గోదావరి నదిలో ఉన్న ఇసుకను, మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే వారికి సహకరించిన వారిని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కూలగొట్టడానికి సహకరించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు.

బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులు సైతం భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడేండ్లు ఇక్కడ పనిచేసి మిగిలిన సర్వీస్ అంతా ఇంట్లో కూర్చుంటారో లేక న్యాయంగా మీ డ్యూటీ మీరు చేసుకుంటారో.., నిర్ణయం మీ చేతుల్లోనే ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ, బీజీకేఎస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.