09-08-2025 01:29:53 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై భారీ సుంకాలతో విరుచుకుపడిన అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. సుంకాల వివాదం పరిష్కారమయ్యేవరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని తేల్చి చెప్పారు. ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ పలు ప్రశ్నలకు సమాధానా లిచ్చారు.
భారత్‌పై సుంకాలు విధింపు అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయా? అన్న ప్రశ్నకు.. ‘లేదు.. వివాదం కొలిక్కి వచ్చే వరకు భారత్‌తో చర్చ ల ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. చైనా సహా ఇతర దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ భారత్‌పైనే అక్క సు ఎందుకని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ‘ఇప్పటికీ ఎనిమిది గం టలే కదా అయింది. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై మరిన్ని సుంకాలు మాత్రం ఉంటా యి’ అని పరోక్షంగా హెచ్చరించారు.
భారత్ వ్యూహాత్మక భాగస్వామి..
ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా శుక్రవారం అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన వి డుదల చేసింది. భారత్ అమెరికాకు వ్యూ హాత్మక భాగస్వామి అని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ పేర్కొన్నారు. ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు నె లకొన్నప్పటికీ వాణిజ్యం పరంగా భారత్ తో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నా రు. వాణిజ్యం,రష్యా నుంచి చ మురు కొనుగో లు విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉ న్నారన్నారు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ చర్యలు తీసుకున్నారన్నారు.
చైనా, టర్కీపై సుంకాలు ఉండవా?
భారతీయ ఉత్పత్తులపై అమెరి కా ఇప్పటికే 25 శాతం సుంకాలతో పాటు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తోంది. తాజాగా అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీం తో భారత్‌పై మొత్తం సుంకం 50 శా తానికి చేరుకుంటుంది. అయితే అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణా లపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీపై సుంకాలు ఎం దుకు విధించట్లేదని ప్రశ్నించింది. గ తంలో చైనా ఉత్పత్తులపై ప్రకటించిన 145 శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. అమెరికా విధించిన సుంకాలపై భారత ప్ర ధాని మోదీ కూడా ఘాటుగా స్పం దించారు. దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనన్నా రు. రైతులు, మత్స్యకారులు, డైరీ రం గం విషయంలో భారత్ రాజీ పడబోదని స్పష్టం చేశారు.