calender_icon.png 21 November, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెక్కీ చేసి దోచేస్తున్నారు!

21-11-2025 12:50:49 AM

-తాళం వేసిన ఇల్లే టార్గెట్ 

-పోలీసులకు తలనొప్పిగా మారిన దొంగతనాలు 

-ఈ ఏడాది 177 కేసులు నమోదు 

-దొంగిలించిన ఆస్తి రూ.79.44 లక్షలు 

-రికవరీ రూ.20.64 లక్షలు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): జిల్లాలో దోపిడి దొంగల తీరు చూస్తే ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు.తాళం వేసిన ఇల్లులను టార్గెట్ చేస్తున్న దుండగులు ఇంటిని గుల్ల చేసి దోచుకు వెళ్తున్నారు.దొంగతనానికి పాల్పడుతున్న దుండగులు ముం దుగానే రెక్కీ వేసి పక్కా ప్లాన్ తో దోపిడీకి పాల్పడుతున్నారు.దొంగలు ముందుగానే ఇండ్ల చుట్టుపక్కల రెక్క చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటున్నారా లేదా అని గమనించినా తర్వాతే చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

రోజురోజుకి దొంగతనాలు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వాతావర ణం నెలకొంది. జిల్లా కేంద్రం లోనీ సాయి నగర్‌లో ఈనెల 19న జరిగిన దొంగతనంతో ప్రజలందరూ ఒకసారిగా ఉలిక్కిపడ్డారు.జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు జరిగిన దోపిడీ దొంగతనాలలో పెద్ద ఎత్తున బంగారం దోచుకు వెళ్లారు.రాజంపేట కు చెందిన బీరెల్లి సురేష్ నివాసంలో ఇటీవల జరిగిన దొంగతనంలో దాదాపు 30 తులాల బంగారం దోచుకెల్లగా బుధవారం సాయినగర్‌లో కవి త నివాసంలో జరిగిన దొంగతనంలో 20 తులాల బంగారంతో పాటు రూ.4.80 లక్షల నగదును దోచుకు వెళ్లారు.జిల్లాలో జరుగుతున్న అడప దడప దొంగతనాలు కొన్ని బయటకు రాగా మరికొన్ని తెలియడం లేదు.

పోలీస్ శాఖ సైతం దొంగతనం జరిగిన వివరాలను విచారణలో భాగంగా గోప్యంగా ఉం చడంతో దొంగతనాల వివరాలు బయటపడడం లేదు. దొంగలు అర్ధరాత్రి వేళల్లో ,ప్రజ లు బయటకు వెళ్లిన సమయంలో అవకాశా న్ని చూసి వారు పని కానిస్తున్నారు. పోలీసు లు కేసుల పరిష్కారానికి వేగవంతంగా చర్య లు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసులను ట్రేస్ చేస్తున్నారు.

రూ. 79 లక్షలు కొల్లగొట్టారు...

జిల్లాలో ఏడాది జరిగిన 177 దోపిడి దొం గతనాల కేసులలో రూ 79,44,346 దోచుకు వెళ్లారు.పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని 130 కేసులను పరిష్కరించగా రూ. 20,64,400 లక్షలను రికవరీ చేశారు.దోపిడి దొంగతనాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘ పెంచినప్పటికీ దుండగులు మాత్రం వారి చేతివాటం ప్రదర్శనను చూపుతున్నారు.

పోలీస్ నిఘా పెంచాలి....

పోలీస్ శాఖ దోపిడీ దొంగతనాల నివారణపై మరింత నిఘా ’పెంచాల్సిన అవసరం ఉందని జిల్లాలోని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ తీరును మెరుగుపరిచి ప్రత్యేక బృం దాల ద్వారా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.పోలీసింగ్ ను కఠిన తరం చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీ ణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకొని నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంది.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి..

పెరుగుతున్న దోపిడి దొంగతనాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.బయటకు వెళ్తే తాళం వేసిన ఇంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం మేలు.సీసీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు పొరుగు ఇంటి వారికి ప్రయాణ వివరాలు చెప్పడం ముఖ్యమే.రాత్రి వేళ విలువైన వస్తువులను బయట ప్రదర్శించడం ద్వారా దోపిడీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతోపాటు 100 కి కాల్ చేసి చెప్పాలి.

ప్రయాణాలకు వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి

జిల్లాలోని ప్రజలు ప్రయాణాలకు వెళ్లవల సి వచ్చినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు లకు సమాచారం ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో గస్తీ పెంచడం జరుగుతుంది.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్లూ కోర్ట్స్,పెట్రోలింగ్ వ్యవ స్థను మెరుగుపరచడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.

 కాంతిలాల్ పాటిల్, ఎస్పీ ఆసిఫాబాద్