calender_icon.png 21 November, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమేశ్వర ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్

21-11-2025 12:50:58 AM

వేములవాడ టౌన్, నవంబర్ 20 (విజయ క్రాంతి): వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనభీమేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.

ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదం అందజేశారు. తరువాత ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ప్భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని విప్ అధికారులకు సూచించారు.

భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్, ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఏఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఏఈఓలు బ్రహ్మంగారి శ్రీనివాస్, విజయకుమారి, జి. అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీకాంతాచార్యులు, ఇతర ఆలయ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.