calender_icon.png 12 December, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజన్-2047 హర్షణీయం

11-12-2025 12:43:06 AM

స్వాతంత్రత సెంటర్ సహ వ్యవస్థాపకుడు రంజిత్ కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విడుదల చేసిన తెలంగాణ విజన్- 2047 పత్రంలో 24/7 మార్కెట్, నైట్-టైమ్ ఎకానమీ ప్రతిపాదనలకు పబ్లిక్ పాలసీ థింక్ట్యాంక్ స్వాతంత్రత సెంటర్ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా స్వాతంత్రత సెం టర్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రంజిత్ కుమార్ దుగుంత్ల మాట్లాడుతూ.. ‘ఈ ప్రకటన మా కోసం ఒక కీలక మైలురాయి.

24/7 మార్కెట్, నైట్-టైమ్ ఎకానమీ మోడల్‌ను అనేక సంవత్సరాలుగా మేము ప్రభుత్వానికి సూచిస్తూ వచ్చాం. ఇప్పుడు అవే ఆలోచనలు విజన్-2047లో ప్రతిబింబించడం ఎంతో ప్రోత్సాహకరం. 24 గంట ల వ్యాపారం అంటే కేవలం ఎక్కువ సమ యం కాదు. అది అవకాశాలు పెంచడం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సమగ్ర, చైతన్యభరిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడం’ అన్నారు. 24 గంటల కార్యక లాపాలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు, ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే ఉద్యోగాలు, పర్యాటకం, పెట్టుబడులు గణనీ యంగా పెరుగుతాయని తెలిపారు.