15-05-2025 01:23:19 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): 72వ మిస్ వరల్డ్ పోటీల పేరుతో తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికతను పక్కన పెట్టడం సరైనది కాదని పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. బుధవారం బీజేపి రాష్ర్ట కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. మిస్ వరల్డ్ వంటి పోటీలు తెలంగాణ సంప్రదాయాలను మంటగలపడమే కాకుండా, విదేశీ విచ్చలవిడి సంస్కృతిని ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు.
గతంలో ఈ- కార్ ఫార్ములా రేసింగ్‌ను వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో ఈవెంట్లు చే యడం వెనుక మతలబేంటని నిలదీ శారు. రాష్ర్టంలో ఓవైపు అన్నదాతలు కన్నీళ్లు పెడుతుంటే.. అందాల పోటీకి కోట్లు కుమ్మరించడమేంటన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేరు కానీ, మిస్ వరల్డ్ అందాల పోటీల పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.