calender_icon.png 9 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి

09-01-2026 12:34:40 AM

జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి లక్ష్మి శారద

సూర్యాపేట, జనవరి 8 (విజయక్రాంతి) :  విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజానికి అంబాసిడర్ లుగా మారాలని జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి,  జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ లక్ష్మి శారద అన్నారు. జాతీయ యువజన దినోత్సవం లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో  గురువారం సూర్యాపేట పట్టణంలోని కోర్ట్ భవనం నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా పి ఎస్ ఆర్ సెంటర్ నుండి పోస్ట్ ఆపీస్ జూనియర్ కళాశాల వరకు  డ్రగ్ ఫ్రీ ఇండియా అవగాహనా  ర్యాలీలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, నరసింహలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో  ఆమె. మాట్లాడుతూ  డ్రగ్స్ అనే మహమ్మారి చాప కింద నీరులా వ్యాపించి యువత జీవితాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వాటిని సమాజం నుండి నిర్ములించేందుకు జిల్లాలోని పరిపాలన, పోలీస్, న్యాయ శాఖలు కృషి చేస్తున్నాయన్నారు. డ్రగ్స్ ఉపయోగించడం వల్ల మనసు,శరీరం,వ్యక్తిత్వం నిర్వీర్యం చెంది తప్పుడు పనులు చేసేలా ప్రేరేపిస్తాయని వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి వాటిని తయారు చేసిన, రవాణా చేసిన, సేవించిన,అమ్మినా, కొనుగోలు చేసిన, తెలియక చేసిన నేరమవుతుందని ఎన్ డి ఎస్ ఏ యాక్ట్ ప్రకారం నేరమవుతుందన్నారు. కావున యువత వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని డ్రగ్ ఫ్రీ సూర్యాపేట నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు..

తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ  డ్రగ్స్ ఉపయోగించడం వల్ల జీవితాలు,కుటుంబాలు ఆగమయవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి  ఫర్హీన్   కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ ఎడిషనల్ జూనియర్ జడ్జి మంచాల మమత,బార్ అసోసియేషన్ చైర్మన్ లింగయ్య, సెక్రటరీ రాజు,ఆర్ డి ఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.