calender_icon.png 14 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవారే రావాలి

14-11-2025 12:05:52 AM

మహేశ్‌బాబు. కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15న హైదరాబాద్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ ఎత్తున ఏర్పాటుచేయనున్న ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభిమానులకు జాగ్రత్తలు తెలియజేస్తూ దర్శకుడు రాజమౌళి గురువారం ప్రత్యేక వీడియోను సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారని, వాటిని అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ ఈవెంట్‌కు అందరినీ అనుమతిస్తారంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ ఈవెంట్‌కు 18 ఏళ్ల లోపు పిల్లలు, వృద్ధులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పాస్‌లు ఉన్నవారు మాత్రమే ఈవెంట్‌కు రావాలని సూచించారు. పాస్‌లు లేనివారంతా జియోహాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చని చెప్పారు. ఈ ఈవెం ట్‌కు హాజరయ్యేవారికి ఉపయుక్తంగా ఉం టుందని ప్రత్యేకంగా వీడియో రూపొందించామని తెలిపారు. అందులో రూట్‌మ్యా ప్ తదితర విషయాలన్నీ స్పష్టంగా ఉంటాయని పేర్కొన్నారు. తమవద్ద ఫిజికల్‌గా ఉన్న పాస్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చని తెలిపారు.