calender_icon.png 14 December, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ప్రజా విజయం..

13-12-2025 12:46:43 AM

సర్పంచ్ ఆనంద్ నాయక్

తాండూరు, డిసెంబర్ 12  (విజయక్రాంతి) : నా విజయం ప్రజా విజయమని.. ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన తండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఓటర్ మహాశయులకు నా విజయాన్ని అంకితం  చేస్తున్నానని... వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కందనెల్లి తండా సర్పంచ్ గా విజయం సాధించిన రాథోడ్ ఆనంద్ నాయక్ అన్నారు.

ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి గ్రామానికి సేవలు అందించేందుకు నిరీక్షించానని..గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన కూడా వెన్ను చూపకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా క్షేత్రంలో ఉన్నానని అన్నారు. తన ఈ విజయానికి సహకరించిన తాండ ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, వీధిదీపాలు, మురుగు కాలువలు పారిశుద్ధ్యం పనులు మరియు గ్రామాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో పేదలకు అందేలా చూస్తానని అన్నారు.