calender_icon.png 14 December, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి

13-12-2025 12:48:09 AM

జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్ కృష్ణారెడ్డి 

కందుకూరు, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): మూడో విడత పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిహెచ్ కృష్ణారెడ్డి ప్రిసైడింగ్  అధికారులకు స్టేజ్ టు అధికారులకు సూచించారు.శుక్రవారం కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు, స్టేజ్ 2 ఆఫీసర్లకు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ఇమాన్యుల్, మల్లేశంలు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొని ప్రిసైడింగ్ ఆఫీసర్లు మరియు స్టేజ్ టు ఆఫీసర్లు యొక్క విధి విధానాలు తెలియజేశారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని ఆయన వారికి తెలియజేశారు. విధి నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ప్రత్యేక అధికారి సుధారాణి, ఎంపీడీవో బి.సరితలు పాల్గొన్నారు.