calender_icon.png 12 December, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలికి సకాలంలో ఓ నెగిటివ్ రక్తదానం

11-12-2025 01:39:06 AM

కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఫకీర్ షేక్ బీ (79) వృద్ధారాలికి ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన రాజు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్తదానం చేసే వారికి గుండె సంబంధిత వ్యాధులు,కొలస్ట్రాల్, క్యాన్సర్ వంటి వ్యాధులు రావడం జరగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం వెల్లడి కావడం జరిగిందని అన్నారు. అపోహలు విడనాడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.11వ సారి రక్తదానం చేసిన రాజు కు అభినందనలు తెలియజేశారు.