calender_icon.png 14 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైవిధ్యమైన చిత్రాలు తగ్గడానికి కారణమదే!

14-11-2025 12:04:01 AM

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరి స్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సంజీవ్‌రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో సినిమా బృందం ప్రెస్‌మీట్ నిర్వ హించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుని చివరలో చిన్న ఎమోషన్ ఫీల్ అయి, మంచి మెసేజ్‌తో బయ టకు వెళ్తారు” అన్నారు.

దర్శకుడు సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. “మనం చేసే సినిమా వల్ల సమాజానికి చెడు జరగకూడదని కృష్ణవంశీ దగ్గర నేర్చుకున్నా. శ్రీధర్ స్నేహంలో పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలనే ఆలోచనలు బలపడ్డాయి. మన చుట్టూ ఉంటే వ్యక్తుల ప్రభావమే మనపై ఉంటుంది. నాకు ఉన్న ఈ స్నేహితులు మంచి కంటెంట్ ప్రేక్షకులకు ఇచ్చేందుకు ఇన్‌స్పైర్ చేస్తున్నారు” అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఏ సినిమా చేసినా అందులో పర్పస్ ఉండాలని కోరుకునే దర్శక నిర్మాతను నేను. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాను కూడా నిజాయితీగా ప్రయత్నం చేశాం. తెలుగు సాహిత్యానికి, సినిమాకు మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే వైవిధ్యమైన చిత్రాలు తగ్గిపోయాయని నా అభిప్రాయం. మన సాహిత్యాన్ని అనుసరిస్తే తెలుగులోనూ మలయాళ ఇండస్ట్రీలోలా కొత్త తరహా సినిమాలు చేయొచ్చు” అన్నారు.