09-03-2025 12:00:00 AM
సుప్రీంకోర్టు కీలక తీర్పు
2018, మార్చి 9: ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా కోమాలో ఉన్నరోగులు గౌరవంగా చనిపోయే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పాసివ్ యుథనేషియా అని పిలువబడే ఇది పూర్తిగా ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది.
బార్బీ దినోత్సవం
1959, మార్చి 9: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడే బార్బీ బొమ్మను సరిగ్గా ఇదే రోజును ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 100 బొమ్మలు అమ్ముడవుతున్నాయంటే బార్బీ క్రేజ్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.