calender_icon.png 26 August, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్

25-08-2025 07:32:48 PM

మరిపెడ, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరిపెడ బంగ్లా పోలీస్ స్టేషన్ లో  సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి కృష్ణ కిషోర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు శాంతిగవంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుపుకోవాలి ప్రతి ఒక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వినాయక మండపం దగ్గర తగు  జాగ్రత్తలు  వహించాలని

అలాగే ఆన్లైన్లో వినాయక మండపాల గురించి నమోదు  చేసుకొని అనుమతులు తీసుకొని వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులను వాడడం తగ్గించాలని రాత్రి 10 దాటిన తర్వాత సౌండ్ సిస్టం  బంద్ చేయాలని నిమర్జనాలలో డీజే ని ఉపయోగించరాదని పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ ఏర్పడే విధంగా చేయకూడదని కమిటీ సభ్యులను డిఎస్పి కోరడం జరిగింది.