calender_icon.png 18 November, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

18-11-2025 12:00:00 AM

మొయినాబాద్, నవంబర్ 17(విజయ క్రాంతి): వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్ పేర్కొ న్నారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్  జన్మదినం సందర్భంగా మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లగోల్ల అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పల్లగోల్ల అశోక్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేసిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలను ఇతర పార్టీలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు.

వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుదని తెలిపారు.  జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ మహేందర్ ముదిరాజ్, పట్నం రామ్ రెడ్డి, కుమ్మరి శంకర్, హనుమంత్ యాదవ్, నేరేట్ల రాజు గౌడ్, దేవులపల్లి రాజు గౌడ్, మాల రాజు, పిరంగీ భాస్కర్, ఆపోజిగూడ రాజు, కంజర్ల శేఖర్, పూడూరు టిల్లు, కుశంగల నవీన్, షాబాద్ సునీల్, కంజర్ల రోహిత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.