20-07-2024 01:12:43 PM
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ సంచలనం సృష్టించింది. నిజామాబాద్ శివారులోని మాణిక్ బండార్ గ్రామానికి చెందిన సాయినాథ్ తన భార్య ప్రసాదం కోసం, మూడేళ్ల కుమారుడితో కలిసి ఆసుపత్రికి వచ్చారు. అయితే అర్ధరాత్రి పూట సాయినాథ్ తన కుమారుని పడుకోబెట్టి, ఫోన్ చూస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుని తీసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ ధ్యాసలో ఉన్న సాయినాథ్ ఈ విషయాన్ని గమనించలేదు. తీరా తన కుమారుడు కనిపించకపోవడంతో ఆసుపత్రిలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ధ్యాసలో పడ్డ సాయినాధ్, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన కుమారుని తీసుకొని వెళ్తున్న, ఆ విషయాన్ని గుర్తించలేదు, సీసీ కెమెరా ఫుటేజీలో ఈ విషయం స్పష్టంగా రికార్డు అయ్యింది. ఫుటేజ్ చూసిన పోలీసులు, ఫోన్ గ్యాస్ ధ్యాసలో పడి తన కుమారుడిని ఇద్దరు వ్యక్తులు తీసుకు వెళ్తున్న పట్టించుకోకపోవడం పై మందలించారు.