calender_icon.png 10 August, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతర వర్షాల దృష్ట్యా ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

20-07-2024 12:48:21 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజల సహాయార్థం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు నిరంతరంగా కురుస్తుండడంతో పాటు రాబోవు 2 రోజులు వర్ష సూచన ఉన్నందున వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.  ప్రజా రక్షణ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఆందోళన పడవద్దని తెలిపారు. ఈ క్రమంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, వరద పరిస్థితులలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు సహాయం కోసం కంట్రోల్ రూమ్ నం.08736-250501, 08736-250502 లలో సంప్రదించవచ్చని, తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.