30-01-2026 01:14:14 AM
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా జరుపుటకు పకడ్బం దీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అభ్యర్దుల దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను, సంబంధిత రిజిష్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్లు సమర్పించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే నామినేషన్ పత్రాలకు జతచేవల్సిన దృవపత్రాలు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ స జావుగా జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణలో జాగ్రత్తగా వ్యవహరిం చాలని అలాగే పలు సలహాలు, సూచనలు చేస్తూ అధికారులకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ మున్నిపల్ ఎన్నికలు జరుపుటకు ఈ నెల 27వ తేదిన నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తుచేస్తూ, జిల్లాలో జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు మొత్తం 48 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
తదనుగుణంగా ఎన్నికలు నిర్వహించుటకు ఈ నెల 28, 29 మరియు 30వ తేదీ సాయం త్రం 5.00 గంటల లోపు అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయుటకు చివరి తేది అని అన్నారు. నామినేషన్ వేయాలనుకునే అభ్యర్దులు చివరి రోజున హడావుడితో ఇబ్బందులు పడకుండా ముందుగా నామినేషన్లు దాఖలు చేయుటకు వీలుకల్పించుకోవాలని కలెక్టర్ కోరా రు. అభ్యర్ధులకు ఎమైనా సమస్యలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. రోజువారిగా దాఖలు అయిన నామినేషన్ల వివరాలను టి-పోల్ యాప్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సినల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.