30-01-2026 01:15:38 AM
టిజిఎస్‌ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి
హనుమకొండ టౌన్, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతరను పురస్కరిం చుకొని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రవాణా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బుధవారం టిజిఎస్‌ఆర్టిసి మేనేజిం గ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో పర్యటించారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్సు క్యాంపులను సందర్శించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. అంతేకా కుం డా బస్సుల రాకపోకలు, క్యూ లైన్ ల నిర్వహణను స్వయంగా పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా, బస్సులను నిరంతరం అందుబాటులో ఉండేలా పక్కా ప్రణాళికతో వ్యవరించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతను దృ ష్టిలో ఉంచుకొని తాత్కాలిక బస్సు క్యాంపుల వద్ద చలువ పందిళ్లు, త్రాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని అన్నారు. జాతర ముగిసే వరకు అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు సమన్వయంతో పనిచేసే భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని తెలిపారు.
అంతేకాకుండా మేడారం జాతర భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్‌ఆర్టిసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని, భక్తుల రవాణా పరంగా ఎలాంటి కష్టాలు కలగకూడదన్నదే మా ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్ధం చేశామని, భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఓ) కేశరాజు భాను కిరణ్, డిపో మేనేజర్లు బి.ధరమ్ సింగ్, పి. అర్పిత, రవిచంద్ర, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.