17-12-2025 12:00:00 AM
గ్రామ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు...
అధికార పార్టీ గెలుపు బాధ్యత పోలీసులది కాదు..
గుండాల, కాచనపల్లి ఎస్సైలపై ఎస్పీ, డీపీఓకి, న్యూడెమోక్రసీ నేత మధు ఫిర్యాదు
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 16 (విజయక్రాంతి ):ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ డబ్బు, మందు, బెదిరింపు లతో పాటు పోలీసులను ప్రయోగించి ,న్యూడెమోక్రసీ అభ్యర్థులను అడ్డుకుంటు న్నారని ,కాంగ్రెస్ పార్టీ కార్య కర్తల్లగా గుండాల, కొమరారం ఎస్.ఐ లు ప్రవర్తిస్తున్నారని గుండాల, కాచనపల్లి, మర్రిగూడెం, పోలారం, కొమరారం, చెట్టుపల్లి ఏరియాలో కాంగ్రెసు ఎంఎల్‌ఎ. లు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలతో , పోలీసులుచెప్పినట్లు పనిచేస్తున్నారనిసిపిఐ(ఎం.ఎల్)ఆరోపించిం ది.
ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్,ఎ స్.పి రోహిత్ రాజు, ఎన్నికల అధికారి డిపిఓ సుధీర్ లను కలిసి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఆ యన వెంట పార్టి జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామ య్య, ఐఎఫ్టియు జి ల్లా సహాయ కార్యదర్శి ఎన్. సంజీవ్ లతో కూ డిన ప్రతినిధి వర్గం వినతిపత్రాలు అం దించింది. అనంతరం రైటర్ బస్తి కొత్తగూ డెం ఎస్పి ఆఫీస్ నందు జరిగిన ముఖ్య స మావేశంలో ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడుతూ, గుండాల ఎస్.ఐ సైదా రవూఫ్ బాహాటంగా నే , అధికార పార్టీ కాంగ్రెసు కు ప్రచారాలు చేయడం జరుగుతుంది.
ఇతరులను. బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరో పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదివాసి నాయకుడు ఈసం పాపారావు న్యూడెమోక్రసీ అభ్యర్ధులకు మద్దతు ఇస్తుం టే ఆయనను పిలిచి 14న రాత్రి 10 గంటల వరకు నిర్బంధంలో ఉంచి న్యూడెమోక్రసీకి మద్దతు ఇవ్వవద్దని, గుర్తు పెట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ప్రచారంలో ఉండాలని బెదిరించారు. కాం గ్రెసు పార్టీ అభ్యర్థి ,వాంకు డోతో అజయ్ , పార్టీ ప్రచారంలో ఉన్న పొంబోయిన హరినాథ్ ను స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి 13న కిడ్నాప్ చేసి కారులో తీసుకొని వెళ్ళారని ,దీనిపై పో లీసులకు కంప్లైట్ ఇచ్చినాపట్టించుకోలేద ని ,కిడ్నాప్ కేసు న మోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇల్లందు మండలంలో కొమరారం ఎస్.ఐ నాగులు మీరా ఖాన్ మర్రిగూడెం, పోలా రం,కొమరారం ఏరియా లో కాంగ్రెస్ వారికి డబ్బులు పంచేందుకు,మద్యం,మాం సం పంపిణీ చేసేందుకు తోడ్పడుతు న్నారని ఆరోపించారు .గ్రామాల్లో న్యూడెమోక్రసీని ఓడించాలని అభివృద్ధి చేసే కాంగ్రెసును గెలిపించాలని, మార్పు కోరుకోవాలని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అధికార పార్టీ నేతలకు ఆదేశాలకు లోబడి పోలీసులు తమ వి ధులకు సంబంధంలేని బాధ్యతలను నిర్వర్తించవద్దని ఎన్నికలను సజావుగా జరిపే వి ధంగా నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని , విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,ఐ ఎ ఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారా మయ్య సహాయ కార్యదర్శి యన్ సంజీవ్ న్యూ డెమోక్రసీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.